టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిరంజీవి బాలయ్య సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఇమే హీరోయిన్ కావడం గమనార్హం. శృతిహాసన్ దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈమెకు ఈ మధ్యకాలంలో వరుస అవకాశాలు వెలుబడుతున్నాయి. ఇక వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. చిరంజీవి నటించిన సినిమా హిట్ అయింది అంటే చాలు శృతిహాసన్ కెరియర్ కచ్చితంగా మళ్ళీ స్టార్ట్ డం అందుకుంటుందని ఆమె అభిమానులు తెలియజేస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా శృతిహాసన్ ఈ చిత్రాలలోని పాత్రలు ఉంటాయని మేకర్ ఎన్నోసార్లు తెలియజేశారు. సంక్రాంతి సినిమాల యొక్క సందడితో ఈ అమ్మడు చేసే హడావిడి వచ్చే రోజుల్లో కచ్చితంగా సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయంటు వార్త వినిపిస్తున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలలో నటిస్తూనే ఉన్నాయి. భారీ అంచనాల నడుమ శృతిహాసన్ నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఈమెతో వర్క్ చేసేందుకు ఎంతో మంది స్టార్స్ సైతం ముందుకు వస్తున్నారు.
శృతిహాసన్ ఇప్పుడు విజయాలు అందుకుందంటే ఇక రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఈమె సీనియర్ హీరోలతో నటించే అవకాశం ఉంటుంది. ఇక సీనియర్ స్టార్స్ కూడా శృతిహాసన్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. స్టార్ హీరో కమలహాసన్ కూతురు అయినప్పటికీ కూడా ఏమి తన తండ్రి పేరు వాడుకోకుండా కేవలం తన స్వతా గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో కూడా నటిస్తోంది.