టాలీవుడ్ ఎంతో పేరును ప్రఖ్యాతను సంపాదించిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అంతేకాకుండా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన ఏన్నో ఓడిదుడుకులు వచ్చినా తట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తన మొదటి భార్య నందిని తో విడాకులు తీసుకోని. ఆ తరువాత హీరోయిన్ రేణు దేశాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇక మూడో భార్య అన్నాలెజినోవాను పెళ్లి చేసుకున్నారు.
ఇక పవన్ చేసుకున్న మూడు పెళ్లిళ్లపై పదే పదే వైసిపి నాయకులు ప్రస్తావిస్తూ నాలుగో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా విషయం మాట్లాడితే అటు తిరిగి ఇటు తిరిగి పెళ్లిళ్ల దగ్గరికి వచ్చి ఆపుతారు కొంతమంది నాయకులు. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూడా వారు మాత్రం అలాగే విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా తన మూడో భార్యకి విడాకులు ఇస్తున్నాడని కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుని ప్రయత్న చేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు వినిపిస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజం కాదని సమాచారం ఇవన్నీ ఆయన మీద వచ్చే పుకార్లు అని ఇక పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవాతో చాలా సంతోషంగా ప్రేమ గానే ఉంటున్నారని సమాచారం. వారి మధ్య ఎటువంటి గొడవలు కానీ, విభేదాలు కానీ రాలేదని అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ పై ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని అందుకు కారణం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొంతమంది నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.