మళ్లీ అల్లు శిరీష్ పై మొదలైన ట్రోలింగ్.. కారణం ఏమిటంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో తక్కువ సినిమాలు చేసి అల్లు అరవింద్ కుటుంబ సపోర్టుతో హీరోగా పేరు సంపాదించారు అల్లు శిరీష్. అల్లు శిరీష్ అల్లు అరవింద్ కు చివరి కుమారుడు.అయితే తన కెరియర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సక్సెస్ లు ఏవి పెద్దగా లేవని చెప్పవచ్చు. చివరిగా ఊర్వశివ రాక్షసివ సినిమాతో మంచి ఫలితం అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఆర్ఆర్అర్ సినిమా విషయంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

Allu Sirish On Endorsing Vocal For Local: "It's Time To Break That Myth"

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో పలు రికార్డులను కూడా క్రియేట్ చేయడంతో పాటు ఈ సినిమా అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. దీంతో సెలబ్రిటీలు సైతం ప్రముఖులు సైతం ఈ సినిమా పైన ప్రశంశాల వర్షం కురిపించారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అల్లు శిరీష్ కూడా అందరిలాగా సోషల్ మీడియా వేదికగా RRR యూనిట్న ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అయితే శిరీష్ తన ట్విట్టర్లో అందరిలాగానే ట్యాగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను మాత్రమే ట్యాగ్ చేయకుండా #ntrjr అని తెలిపారు.

వాస్తవానికి తారక్కు అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అల్లు శిరీష్ కావాలని ఈ విధంగా చేశారంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అల్లు శిరీష్ పొరపాటు చేసి ఉంటే ఆ తర్వాత ఆయన ట్విట్టును ఎడిట్ చేయవచ్చు. అయితే అల్లు శిరీష్ కావాలనే ఇలా చేశారంటు కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అల్లు శిరీష్ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. ఫ్యాన్స్ హర్ట్ చేసే పనులు శిరీష్ చేయడం కరెక్ట్ కాదని మరికొంతమంది భావిస్తున్నారు. రామ్ చరణ్ ను ట్యాగ్ చేసినట్టే ఎన్టీఆర్ను కూడా ట్యాగ్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది నెట్టేసన్లు అభిప్రాయపడుతున్నారు.

Share.