“వరిసు” థియేటర్లో దర్శనమిచ్చిన త్రిష.. సందడి మామూలుగా లేదుగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా విజయ్ దళపతి వంశీ పైడిపల్లి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ద్విభాషా చిత్రం వరిసు.. తెలుగులో వారసుడు.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ , జయసుధ, సంగీతా వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రం తమిళ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడుకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీలలో కూడా చాలామంది విజయ్ అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు.

హీరోయిన్ త్రిష విజయ్ దళపతి కి అభిమాని కావడంతో ఉదయాన్నే వరిసు థియేటర్లో ప్రత్యక్షమైంది. ముఖ్యంగా ఆమె థియేటర్లో చివర్లో నిలబడి సినిమా చూస్తుండగా విజయ్ అభిమానులు ఈ వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. తను ఫ్రెండ్స్ గ్యాంగ్ తో త్రిష వరిసు మూవీ ని ఎంజాయ్ చేసింది . చెన్నైలోని ఒక మల్టీప్లెక్స్ లో త్రిష సినిమా చూస్తున్నప్పుడు తీసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఏది ఏమైనా ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా సామాన్య ప్రేక్షకుల లాగా థియేటర్ లోకి వచ్చి సినిమా చూడడం నిజంగా ఆశ్చర్యకరం. అందులో తన అభిమాన హీరో సినిమా చూడడం విజయ్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇకపోతే జనవరి 14వ తేదీన తెలుగులో వారసుడు పేరిట ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ చిత్రం చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంటతడి పెట్టుకున్న వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.

Share.