మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన.. మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా మొగల్తూరు నుండి మెగాస్టార్ వరకు చిరంజీవిది ఒక మహాప్రస్థానం. ఇండస్ట్రీలో మెగాస్టార్ ఒక లెజెండ్ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి అలాంటి మెగాస్టార్ రాజకీయాల్లోకి రాగానే తొక్కే ప్రయత్నం చేశారు. కొంతమంది అదే పనిగా విష ప్రచారం చేసి ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయాలనుకున్నారు.
ఈ క్రమంలోనే మొగల్తూరు లో ఉన్న చిరంజీవి ఇంటిని లైబ్రరీ కోసం అడిగితే చిరంజీవి ఇవ్వకుండా మూడు లక్షల కోసం అమ్ముకున్నారని.. ఇంకా అమ్మలేదా అని.. చిరంజీవి తన మేనేజర్ల మీద కోపడ్డారని.. ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని.. అప్పటికప్పుడు అమ్మేసుకున్నారని కూడా బాగా దుష్ప్రచారం చేశారు. అంతే కాదు గత రెండు నెలల క్రితం కూడా ఇదే విషయం బాగా వైరల్ అయింది . అయితే ఎవరో కావాలని చిరంజీవి ఇమేజ్ ను డామేజ్ చేయడానికి ఇలాంటి పన్నాగాలు పన్నినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుష్ప్రచారం వల్ల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై.. అత్యంత ప్రభావం చూపించింది . అయితే ఈ విషయంపై చిరంజీవి ద్వారా జర్నలిస్టు ప్రభు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతమైన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపద్యంలో ప్రమోషన్స్ లో శెరవేగంగా పాల్గొంటున్నారు . ఈ క్రమంలోనే జర్నలిస్టు మొగల్తూరులో ఉన్న ఇంటి గురించి మాట్లాడడంతో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.. చిరంజీవి మాట్లాడుతూ.. మొగల్తూరులో ఉన్న ఇల్లు అసలు తనది కాదు అని, అది తన మేనమామ శ్రీనివాసరావు ఆస్తి అని తెలిపారు. తన తల్లి తమ్ముడు ఇంటి మీద తనకు ఎలా హక్కు ఉంటుందని కూడా తెలిపారు. చిరంజీవి ఆ ఇంట్లో తన తల్లి ప్రసవించడం వల్ల తాను అక్కడ జన్మించానని.. అక్కడే చదువుకున్నానని.. అంతకుమించి ఆ ఇంటి పై తనకు హక్కు లేదు అని చిరంజీవి వెల్లడించారు. అయితే మావయ్య ఆ ఇంటిని అమ్మేసుకొని వెళ్ళిపోయారని, గ్రంథాలయాన్ని తాను ఈ ప్రస్తావన రాకముందే కట్టించానని.. ఆల్రెడీ మొగల్తూరులో లైబ్రరీ ఉందని కూడా స్పష్టత ఇచ్చారు చిరంజీవి.