పుష్ప -2 చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రష్మిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నది . రష్మిక టాప్ హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ .అయితే మొదట్లోనే చాలా సినిమాలతో అగ్ర హీరోలతో నటించి మంచి విజయాలు అందుకున్న వారిలో రష్మిక కూడా ఒకరు. ఈమెకి భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది రష్మిక. ప్రస్తుతం ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నది.

Rashmika Mandanna Words On Pushpa 2 Are Making Our Wait Harder!

ఇక తమిళంలో హీరో విజయ్ సరసన వరిసు సినిమా తమిళ వర్షన్ విడుదల కానుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమా కూడా జనవరి 20వ తేదీకి విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో కూడా రష్మిక ఎంతో బిజీగా ఉన్నది .పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పుష్ప2 నుంచి తప్పుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ వార్తపై రష్మిక క్లారిటీ ఇవ్వడం జరిగింది.అక్కడ రెండు సినిమాలు విడుదల అవుతున్నాయని అందుకోసమే కొంచెం బిజీగా ఉన్నానని సోషల్ మీడియా వేదికపై అభిమానులతో కొన్ని మాటలను ముచ్చటించారు. అయితే ఈ క్రమంలోనే ఒక నేటిజన్ మీరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏంటి అని ప్రశ్నించడంతో రష్మిక పుష్ప ది రూల్, మిషన్ మజ్ను, వారసుడు, యానిమల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఆమె మాటల్లో తెలిపింది. ఆమె ఇలాంటి సమాధానం ఇవ్వటంతో పుష్ప-2 సినిమాలో రష్మిక ఉందని క్లారిటీ వచ్చింది.. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చే వార్తలు నిజం కాదని అవాస్తవమని క్లారిటీ వచ్చేసింది.

Share.