టాలీవుడ్ లో సమంత కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది సమంతకు. రీసెంట్ గా యశోద సినిమాతో ప్రమోషన్ లో తనకు మయోసైటిస్ ఉందని సోషల్ మీడియాలో తెలపడంతో ప్రతి ఒక్కరూ చాకు గురయ్యారు. . పైగా తను బాధపడుతూ డబ్బింగ్ చెప్తున్నా అంటూ జనాల సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.
సోషల్ మీడియాలో సమంత కి వ్యతిరేకంగా, సపోర్టుగా కొంతమంది ఉన్నారు . ఈ ఎమోషనల్ వీడియో బయటకు రాగానే ఆమె ఒక మహానటి అని, అయితే ఈమె ఎవరికోసం ఏడుస్తోంది. ఒకవేళ సమంత ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల అలా ఏడ్చిందా అని మరికొంతమంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు మాత్రం సమంతపై విరుచుకుపడ్డారు.
ఆమె ఏమైనా సంఘ సేవ చేసి కష్టాలు అనుభవించిందా? డబ్బులు తీసుకొని సినిమా చేసింది అంతే సినిమాని ప్రమోట్ చేసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఆ టైంలో ఏడ్చి లేనిపోని బిల్డప్పులు ఇవ్వడం ఎందుకు అంటూ చిట్టి బాబు ప్రశ్నించారు. అయితే సమంత ఇలా చేయటం కొత్తేమీ కాదు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలా చీప్ పబ్లిసిటీ చేయటం పట్ల జనాలు నవ్వుతున్నారు. అంటూ చిట్టి బాబు తెలియజేశారు. ఒకవేళ సమంతకి బాగా లేకపోతే ట్రైలర్ ఈవెంట్ కి ఎందుకు రావాలి. సినిమా రిలీజ్ ప్రమోషన్ కి వచ్చి ఉంటే బాగుండు కదా అన్నారు. ఇక చిట్టిబాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే సమంత కన్నీళ్లు ఈ సినిమాకు పనికి వస్తాయో రావో చూడాలి మరి.