RGV.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ (RGV) గతంలో శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో అన్ని అడల్ట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా స్త్రీ మోహంలో పడి అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాడు అని ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. నిజానికి రాంగోపాల్ వర్మ (RGV) లో ఉన్న టాలెంట్ చూస్తే మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకు నిర్దర్శనం శివ లాంటి సినిమాలే అని చెప్పాలి.
ఎప్పుడూ కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉండడానికి ఇష్టపడతాడు . ఇకపోతే ఇండస్ట్రీకి రావడానికి మాత్రం ఈయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అల్లరి చిల్లరిగా కాలేజీలో తిరుగుతూ.. రౌడీలా ఒక బ్యాచ్ ని వెనకాల వేసుకొని ఎప్పుడు కనిపించే వారట వర్మ . చదువును చాలా ఈజీగా తీసుకొని సినిమా తీయాలని గట్టిగా అనుకున్నాడట . అదే విషయం అతని తండ్రితో కూడా చెప్పాలని ఒక రోజు నిర్ణయించుకున్నాడట. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ తండ్రి పేరు కృష్ణంరాజు వర్మ (Krishnamraju varma). ఆయన సౌండ్ ఇంజనీర్ గా అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసేవారు. అందుకే కృష్ణంరాజు వర్మ కి సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు బాగా ఉండేవి.
దాంతో ఒకరోజు వర్మ తండ్రి దగ్గరకు వెళ్లి తాను కూడా సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడట. అయితే ఆ రోజు వరకు వర్మ లైఫ్ ను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఎప్పుడూ కాలేజీలో గొడవలు ..కొట్లాటలే.. అందుకే సినిమాలోకి రావాలన్నమాట చెప్పినప్పుడు తండ్రి నో చెప్పాడట . సినిమా అంటే ఆటలాగా అనిపిస్తుందా? అందుకోసం ఎంతో కష్టపడాలి? ఇండస్ట్రీకి రావాలి అని ఆలోచన పక్కన పెట్టి ముందు సరిగ్గా చదువుకో అంటూ మందలించారట.
తండ్రి మాటను కాదనలేక అందుకు తగ్గట్టుగానే బాగా చదువుకొని తాజ్ కృష్ణ హోటల్ (Taj Krishna hotel) కడుతున్నప్పుడు అక్కడ సైట్ ఇంజనీరుగా పనిచేయడానికి ఒక వ్యక్తి కావాల్సి ఉందని తెలిసి అక్కడికి వెళ్లి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అలా తాజ్ కృష్ణ వంటి ఫైవ్ స్టార్ హోటల్ కి రాంగోపాల్ వర్మ సైట్ ఇంజనీర్ గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత సినిమానే లోకంగా మార్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దూసుకుపోయాడు.