తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్రకారుల కలల రాకుమారిగా మారిపోయింది. మొదట సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక అటు తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈమె అందాలకు ఫిదా అయిపోయారు కుర్రకారులు. దీంతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ . అటు తరువాత డిస్కో రాజా, సోలో బతికే సో బెటర్ ,అల్లుడు అదుర్స్ అంటే తదితర చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే గత ఏడాది ఈమె నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈమె ఏ సినిమాలలో కూడా పెద్దగా నటించలేదు కానీ గ్లామర్ ఫోటోసులతో మాత్రం అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేది. అయితే ఈమె సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అని ప్రశ్న అభిమానుల తలెత్తగా అందుకు కారణం ఆమెకు ఒక యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ.. నేను గత కొంతకాలం నుండి మీకు దూరంగా ఉంటున్నానని నాకు తెలుసు.. నేను మిమ్మల్ని మిస్ అయినట్టుగానే మీరు కూడా నన్ను మిస్ అయి ఉంటారని నాకు తెలుసు అంటూ తెలియజేస్తోంది.
2022 నాకు ఎంతో కష్టంగా గడిచింది.. నాకు యాక్సిడెంట్ అయ్యింది.అవును నేను యాక్సిడెంట్ కి గురయ్యాను దీంతో తన ఎడమ భుజానికి చాలా గాయం అయింది ఎముకలు కూడా విరిగాయి, సర్జరీలు కూడా జరిగాయి,శారీరకంగా మానసికంగా చాలా బాధను అనుభవించాను.. ఈ బాధనంత నేను మీ ప్రేమతో జయించాను అదేమీ అంత సులువుగా అయితే జరగలేదు. మీ ప్రేమతోనే అది సాధ్యమైంది అంటూ తెలియజేసింది నభ నటేష్. ప్రస్తుతం తాను పూర్తిగా కోరుకున్నాను అంటూ తెలియజేసింది.