కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కాంతారా. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కేవలం రూ .16 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం రూ .400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాని నిర్మించిన హోం భలే ప్రొడక్షన్ ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందని అధికారికంగా ప్రకటించారు. కాంతారా సినిమా రెండు విభాగాలలో ఆస్కార్ నామినేట్ అయినట్లుగా తెలియజేశారు. 95 వ ఆస్కార్ అవార్డుల తమ కాంతారావు సినిమాని చేర్చాలని చిత్ర బృందం అప్లై చేయగా వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా రెండు భాగాలలో కాంతార ఆస్కార్ బరిలో నిలుస్తోందని చెప్పవచ్చు. ఇదివరకే RRR చిత్రం కూడా ఆస్కార్ బరిలో ఉంటుందని చెబుతూ ఉండగా ఇప్పుడు మరొక సౌత్ ఇండియా సినిమా కూడా ఆస్కార్ పోటీలో నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద ఘనవిజయాన్ని అందుకొని నేషనల్ వైడుగా ఆడియన్స్ సూపర్ ఎంటర్టైన్మెంట్ చేసింది. దీంతో కొంతమంది నేటిజన్లు ఈ సినిమా చూసినప్పుడే ఆస్కార్ బరిలో నిలుస్తుందని కొంతమంది సినీ విశ్లేషకులు చెప్పినట్లుగా తెలియజేస్తున్నారు. కాంతారా సినిమా భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక భావనలో వచ్చిన సినిమానీ ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
ముఖ్యంగా భూత కోలవారి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా అంత చాలా ఎక్సైటింగ్ గా ప్రేక్షకులను అలరించింది.తప్పకుండా ఈ సినిమా ఆస్కార్ వచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు సినీ విశ్లేషకులు నేటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో రిషబ్ నటన ఈ సినిమాకి అద్భుతంగా నిలిచిందని చెప్పవచ్చు.