టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరమే లేదు. ఈమధ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. డైరక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హర హర వీరమల్లు ఈ మూవీ ఇప్పటికి 80% పూర్తి చేసుకుంది. అర్జున్ రాంపాల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవటంతో ఆ స్థానంలో బాబి డియోల్ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది.ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ సినిమా కీలక పాత్రలో ఆదిత్య మీనన్ కనిపిస్తున్నారు. మరో యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో నటించనుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ తో పాటు మరో మూడు భారీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు పవన్ తేరి, రీమేక్ ఆధారంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరిశంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని ఇటీవలే ప్రకటించారు. దీన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరిశంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈమధ్య ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో చాలా బిజీగా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి సిద్ధం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి మొదటి వరకే డేట్స్ ఇచ్చి నిర్మాతలకు అందుబాటులో ఉండనున్నాయని ఆ తరువాత ఎన్నికల ప్రచారం కోసం వెళ్లాలని ఒకవేళ సినిమాలు ఏవైనా ఉంటే ఎలక్షన్ తర్వాతే నిర్మాతలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడట.