మెగాస్టార్ చిరంజీవి మరొకసారి డైరెక్టర్ కొరటాల శివని టార్గెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం వేదికగా ఆదివారం రోజున వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి దాదాపుగా అరగంట పైనా మాట్లాడడం జరిగింది. మాటల మధ్యలో డైరెక్టర్ బాబి యాటిట్యూడ్ గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి పరోక్షంగా ఆచార్య సినిమా డైరెక్టర్ కొరటాల శివ పైన కూడా సెటైర్లు వేశారు. ఇక్కడ చిరంజీవి పేరు అయితే చెప్పలేదు.. కానీ ఆయన మాటలను చూస్తే కొరటాల శివనే ఉద్దేశించి అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ లో డైరెక్టర్ బాబి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చేస్తున్నంతసేపు తనకి డైరెక్టర్ బాబీ పైన ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉండేది. అందుకు కారణం అతని కష్టపడే తత్వం ఫోకస్ గా పని చేయడం ఎవరు ఏం చెప్పినా యుగోలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం అని తెలిపారు. ఎవరైనా ఏదైనా విషయం చెబితే చాలు వాటిని పెడచెవిన పెట్టకుండా అనుసరిస్తారని తెలిపారు చిరంజీవి. అయితే మొదటి రోజు కథ విన్న దానికంటే ఆ తర్వాత అద్భుతంగా రూపొందించారు బాబి అని చిరంజీవి తెలిపారు.
చిరంజీవి లీడ్ రోల్ పోషించిన ఆచార్య సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా కథనం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ అప్పుడప్పుడు చిరంజీవి పైన సెటైర్లు వేస్తూ ఉండేవారు. కథ విషయంలో చిరంజీవి ఇచ్చిన సలహాలన్నీ అప్పట్లో కొరటాల శివ పట్టించుకోలేదని కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ తాను సినిమా డైరెక్టర్ చేయలేదని చిరంజీవి, రామ్ చరణ్ యాక్ట్ చేస్తుంటే అలా సెట్ లో ఉండేవాణ్ణి అని తెలిపారు.