సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు అభిమానులు ఉండడం సర్వసాధారణం కానీ నిర్మాతలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అదొక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అలాంటి వారిలో అల్లు అరవింద్ కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ ని గురించి ప్రత్యేక అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ నిర్మించిన సినిమాలలో దాదాపుగా 90 శాతం విజయాలు ఉన్నాయని చెప్పవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు.
ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు అల్లు అరవింద్. అలా 1974లో గీత ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారారు. అప్పటి నుంచి నిర్మాతగా స్టూడియో అధినేతగా డిస్ట్రిబ్యూటర్ గా ఆహా ఓటీటి అధినేతగా తన కెరీర్ను కొనసాగిస్తూ ఉన్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్లో సూపర్ హిట్ చిత్రాలను కూడా నిర్మించారు. 1949 జనవరి 10వ తేదీన అల్లు రామలింగయ్య కనకరత్నం దంపతులకు జన్మించారు. తన తొలి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బంట్రోతు భార్య సినిమాను నిర్మించి మంచి సక్సెస్ అయ్యారు.
ఇక ఆటు తర్వాత మా ఊళ్లో మహాశివుడు, దేవుడు దిగివస్తే అనే సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.మొదటి మూడు చిత్రాలు వేరే వాళ్ళతో నిర్మించిన అల్లు అరవింద్.. తొలిసారి తన చెల్లెలు భర్త ఆయన చిరంజీవితో శుభలేఖ చిత్రాన్ని.. నిర్మాత వివి. శాస్త్రి తో కలిసి ప్రశాంతి క్రియేషన్ బ్యానర్లు నిర్మించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక అటు తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించి అల్లు రామలింగయ్య వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక నిర్మాతగా తన సినీ కెరియర్ లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజున అల్లు అరవింద్ గారి బర్త్డే కావడం చేత ఈ విషయం వైరల్ గా మారుతున్నాయి.