బాలీవుడ్ క్రేజీ హీరోలు ఎక్కువగా పీఆర్ టీమ్ ని సెట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ సినిమాల ప్రమోషన్స్ ని జోరుగా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇదే ఫార్ములానే విజయ్ దేవరకొండ కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తమ సినిమాల ప్రమోషన్స్ తో పాటు కమర్షియల్ యాడ్స్ కు కూడా సంబంధించి ప్రమోషన్లకు అగ్రిమెంట్ చేస్తున్నారని సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండకు కూడా బాలీవుడ్‌కు సంబంధించిన టీమ్ పని చేస్తుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
ఇక అల్లు అర్జున్ కూడా టాలీవుడ్ లో పిఆర్ టీమ్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. తన టీం ఏ స్థాయిలో బన్నీ సినిమాలకు ప్రమోట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అల్లు అర్జున్ నుంచి విడుదలైన సినిమాలు అన్నీ కూడా వారి వల్లే మంచి సక్సెస్ అయ్యాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పీ అర్ టీమ్ నే రామ్ చరణ్ కోసం ఉపాసన సెట్ చేయబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉపాసన ప్రత్యేకమైన కేర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. RRR సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.
ఇక దీంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించారు.రామ్ చరణ్ ప్రస్తుతం పలు అంతర్జాతీయ వేదికల పైన పలు అవార్డులను కూడా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్లేందుకు ఉపాసన పీ అర్ టీమ్ ను సెట్ చేసినట్లు సమాచారం. తన ప్రమోషన్స్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఉపాసన దగ్గర ఉండి చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాంచరణ్ కెరియర్ కు ఉపాసన కీలకంగా మారనుందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.