టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఇక ఇటీవలే యశోద సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయినా కూడా సమంత అభిమానుల కోసం పలు సినిమాలలో నటిస్తూ ఉంటోంది.దాదాపుగా సమంత మీడియా ముందుకు రాక కొన్ని నెలలు కావస్తోంది. యశోద సినిమా ఫ్రీ రిలీజ్ సమయంలో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చింది. ఇందులో తనకి ఉన్న ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేసింది సమంత.
అందులో చాలా బాగా ద్వేగానికి లోనే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అప్పటి నుంచి మళ్లీ సమంత మీడియా వద్దకు రాలేదు. రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే సమంత లెఫ్ట్ హ్యాండ్ లో మాత్రం ఒక జపమాల మాత్రం కనిపించింది. దీంతో పలువురు అభిమానులు, నేటిజెన్లు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. నిన్నటి రోజున శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ లో కూడా సమంత ఇదే జపమాలతో కనిపించడంతో సమంత ఏం చేస్తోంది తనలో ఆధ్యాత్మిక చింతన మొదలయ్యిందా అని అనుమానాలు మొదలవుతున్నాయి.
గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించిన సమంత ఇప్పుడు మాత్రం అంతగా కనిపించలేదు. ప్రతిరోజు 10,000 శ్లోకాలు జపిస్తూ సమంత ప్రత్యేక జపం చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.అందుచేతనే ఎక్కడికి వెళ్లిన కూడా వెంట జపమాల కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లుగా తెలుస్తోంది. సమంత క్రిస్టియన్ అయినప్పటికీ కూడా రీసెంట్గా హిందువుగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సమంతను పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు.