టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత. సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. గడచిన కొద్ది రోజుల క్రితం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని మరి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
హిస్టారికల్ సినిమా అయినటువంటి కథ అంశంతో వస్తున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,హిందీ, తమిళ్ ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ ట్రైలర్ అద్వంతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. సమంత మరొకసారి తన అందం అభినయంతో ఆకట్టుకోబోతోందని ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ సినిమాలో శకుంతలాగా సమంత నటిస్తోంది.
దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పలు అప్డేట్లు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్తో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొల్పే విధంగా చేసింది. దుర్వాసమునిగా మంచు మోహన్ బాబు.. అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్ష భారతాగా నటిస్తున్నది. వచ్చేనెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఈ సినిమా కూడా త్రీడీలో ప్రేక్షకులు చూడవచ్చు.