హీరో రామ్ కు వివాహమైందా.. మరి ఇంత పెద్ద కొడుకా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు పొందిన రామ్ పోతినేని ఎనర్జిటిక్, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గడిచిన కొద్ది రోజుల క్రితం వరకు హీరో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. కానీ అవన్నీ వోట్టి పుకార్లే అన్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని స్పష్టం చేశారు. ఇక రామ్ చివరిగా ది వారియర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం రామ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.

Ram Pothineni: పెళ్లి కాకుండానే రామ్ పోతినేని తండ్రయ్యాడా..? - PakkaFilmy

అయితే తాజాగా రామ్ తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్ గా మారుతోంది.. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇది సన్ డే.. సిద్ధాంత్ పోతినేని.. అంటూ ఒక చిన్న పిల్లాడు తో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడం జరిగింది రామ్. అది చూసిన వారంతా రామ్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. అసలు వివాహం ఎప్పుడు అయింది అంటూ అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడా అనే అనుమానాలకు కూడా దారితీస్తోంది.

RAm POthineni (@ramsayz) / Twitter

అయితే మరి కొంతమంది మాత్రం ఈ పిల్లవాడు ఎవరా అంటూ ఆరా తీయగా.. అయితే ఈ పిల్లవాడు రామ్ కొడుకే కానీ ఈ ఫోటోలో ఉన్న సిద్ధాంత్ ఎవరో కాదు రామ్ సోదరుడి కొడుకు అన్నట్లుగా సమాచారం. తనకు షూటింగ్ సమయం లో కాస్త గ్యాప్ దొరికిన వెంటనే రామ్ ఈ పిల్లాడితో ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారని రామ్ సన్నిహితులు తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున సన్ డే అంటూ సిద్ధాంత్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతొంది.

Share.