సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల సైతం ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన వారు చాలా మందే ఉన్నారు. అలా ఉన్నపలంగా మాయమవుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలు ఫెయిల్ అవ్వడం వల్ల మరి కొంతమంది పర్సనల్ విషయాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలా ఉన్న ఫలంగా దూరమైన హీరోయిన్లలో హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. కమల్ని ముఖర్జీ పేరు వినగానే ముఖ్యంగా ఆమె అందం అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ క్లాసిక్ మూవీతోనే ఆకట్టుకుంటూ వచ్చేది.
అంతేకాకుండా కమలి ముఖర్జీ న్యాచురల్ బ్యూటీగా కూడా పేరుపొందింది. ఈమెకు హాట్ ఆఫర్లు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటిని రిజెక్ట్ చేస్తూ వచ్చేదట. ఒకవేళ హాట్ ఆఫర్లు కమలి ముఖర్జీ ఓకే చెప్పి ఉంటే ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూ ఉండేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అందుకే చాలా తొందరగా సినీ ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కమలి ముఖర్జీ సినీ ఇండస్ట్రీకి దూరమై ఇప్పటికి ఆరు సంవత్సరాలు పైనే అవుతుంది ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు. ఆయన కూడా ఎక్కడ ఈమె కనిపించలేదు.
దీంతో కమలి ముఖర్జీ అభిమానులు ఈమె గురించి తెగ వెతకడం ప్రారంభించారు.. అయితే కమలిని ముఖర్జీ తన సోదరులతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్యూటీ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బేకరీ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ బిజినెస్ లో మాత్రం బాగానే దూసుకుపోతోంది.