కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు విడుదలయ్యి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. తమిళంలో మాత్రం నెంబర్ వన్ హీరోల తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తెలుగులో కూడా ఈ చిత్రాలను డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఇక సంక్రాంతి బరిలో తాను నటించిన వారీసు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే గతంలో హీరో విజయ్ ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేయడం వల్ల తన తండ్రి చేతుల్లో తిట్లు తిన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
అయితే హీరో విజయ్ సంఘవి కాంబినేషన్లు చాలా సంవత్సరాల క్రితం రసిగన్ సినిమా తెరకెక్కించగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకు విజయ్ తండ్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి విషయాన్ని సంఘవి తెలియజేస్తూ.. ఒక సన్నివేశంలో భాగంగా చెరువులో నేను విజయ్ రొమాంటిక్ సీన్లో నటించాల్సి ఉందని.. ఆ సీన్లో నేను బాగానే నటించిన విజయ్ మాత్రం సరిగ్గా నటించలేదని తెలియజేస్తోంది. దీంతో విజయ తండ్రి విజయన రొమాన్స్ సరిగ్గా చేయలేదని తిట్టారట.
ఆ సన్నివేశంలో నటించడం కోసం విజయ్ పడిన ఇబ్బంది అంతా కాదని సంఘవి తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది. మరొకవైపు సంఘవి ప్రస్తుతం ఎక్కువ సినిమాలలో నటించడం లేదు. కేవలం సినిమాలలో రీయంట్రీ కోసం పర ప్రయత్నాలు చేస్తానని వార్తలు వినిపిస్తున్నాయి అభిమానులకు కూడా ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. వారసుడు సినిమా రిలీజ్ సమయంలో సంఘవి గురించి విజయ్ చెప్పిన వాక్యాలు విని అభిమానుల సైతం పలు రకాలుగా చేస్తున్నారు.