టాలీవుడ్ లో నేచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాతో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలలో నటించి తన అందంతో ,నటనతో, డాన్స్ తో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సాయి పల్లవి సినిమాలలోనే కాకుండా వైద్య వృత్తిలో కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో సాయి పల్లవి పైన గత కొద్దిరోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందని డాక్టర్ గా సెటిల్ కావాలని ప్లాన్ చేస్తోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం పైన తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ.. అందం అన్నది కేవలం రూపంలో కాదని గుణంలో చెప్పే ప్రేమమ్ సినిమాతో తన సినీ కెరియర్ మొదలయ్యిందని ఆ చిత్రం అనుకోకుండా పెద్ద విజయాన్ని అందుకుందని తెలియజేసింది.
తాను ఎంబిబిఎస్ చదివిన నటిని కావాలనుకున్నాను దీంతో తన తల్లిదండ్రులు కూడా ఈమెకు ఎటువంటి కండిషన్స్ పెట్టలేదని సపోర్ట్ చేశారని తెలియజేసింది. తాను నటించే పాత్రలు సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని భావిస్తానని అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా తనని తమ ఇంటి ఆడపడుచు గా భావించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.మంచి కథలు వస్తే కచ్చితంగా భాషతో సంబంధం లేకుండా సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుతోంది. దీంతో సాయి పల్లవి సరైన కథ కోసం వెయిట్ చేస్తోందని చెప్పవచ్చు.