టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తను నటించే చిత్రాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం గమనార్హం. ముఖ్యంగా ప్రభాస్ డేట్స్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కానీ ఒక్క హీరోయిన్ తో నటించలేకపోయారు. ముఖ్యంగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరు ఎందుకు నటించలేదో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ఒక దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో సమంత కూడా ఒకరు ప్రభాస్ తో మాత్రం ఇమే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సమంత కూడా ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ ద్వారా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్లో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.
దీంతో అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే ఇద్దరు కాంబోలో సెట్టు కాకపోవడానికి ఒక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ చాలా హైట్ ఉంటారని చెప్పవచ్చు దాంతో ఆయన హైట్ ఆరడుగుల పైన ఉంటుంది కానీ సమంత మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అందుచేతనే ప్రభాస్ పక్కన హీరోయిన్ అంటే దాదాపుగా ఎత్తుగల హీరోయిన్ ని ఎంపిక చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ పక్కన సమంత హైట్ సెట్ కాదని కారణంతోనే దర్శక నిర్మాతలు ఇమెను ఎంపిక చేయనట్లు సమాచారం.