బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా మొత్తం ఫ్యాక్షనిజంతో తెరకెక్కించినట్లుగా ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్ ,సాంగ్స్ చూస్తే ఈ విషయాన్ని ఇట్టే చెప్పగలరు. అయితే ఈ సినిమాలో బాలయ్య రాజకీయ ఆలోచనలు కూడా చాలానే ఉన్నట్లుగా డైలాగులు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ చూస్తే అవునని అనిపించేలా కనిపిస్తోంది ట్రైలర్లు కొన్ని డైలాగులు వింటుంటే తన పార్టీ టిడిపికి అనుకూలంగా బాలయ్య ఈ మాటలు చెప్పారు అనే విషయం కనిపిస్తోంది.
ముఖ్యంగా వీరసింహారెడ్డి నేరుగా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న పార్టీని విమర్శించడం కాదు కానీ ఇన్ డైరెక్ట్ గా అన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న వీర సింహారెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ట్రైలర్ను కూడా విడుదల చేశారు అందులోనే డైలాగులు ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై పరోక్షంగా వేసిన ఈ పంచు డైలాగులు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది..
చాలా ఏళ్ల నుంచి ఉన్న ఎన్టీఆర్ పేరుని తీసేసి మాజీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.అప్పట్లో ఈ విషయం గురించి టిడిపి బాగానే నిరసన చేసింది.కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో వీరసింహారెడ్డి సినిమాలు ఈ విషయం మీద కౌంటర్ ఉందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలోని డైలాగులు చాలా వైరల్ గా మారుతున్నాయి. అలాగే కొంతమంది పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఇందులోనే డైలాగులు వినిపించారు అనే విషయం వైరల్ గా మారుతోంది. మరి ఈ డైలాగులు ఈ సినిమాని హైలెట్ గా చేస్తాయా లేదంటే ఫ్లాప్ చేస్తాయా అనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.