తెలుగు బుల్లితెరపై రాములమ్మగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. అలా వచ్చిన క్రేజీతోనే ఈమె పలు చిత్రాలలో అవకాశాలను అందుకోవడమే కాకుండా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో మరింత క్రేజ్ రావడానికి పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించే అవకాశాలు వెలుపడ్డాయి.కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది శ్రీముఖి. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ వస్తోంది. దీంతో అభిమానులను బాగానే సంపాదించుకుంది శ్రీముఖి.
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి శ్రీముఖి వివాహం పైన పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈమె వారిని వివాహం చేసుకుంటోంది ..వీరిని వివాహం చేసుకుంటుంది అనే వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ విషయంపై గట్టిగా కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి. మరి కొంతమంది ఏకంగా తన తండ్రి ఫోటోలను బ్లర్ చేసి ఇతనిని వివాహం చేసుకోబోతోంది అంటు పలు రకాలుగా తెలియజేస్తూ ఉండడంతో శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన గురించి తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలియజేసినట్లు సమాచారం. ఏకంగా తండ్రితోనే పెళ్లి జరుగుతోంది అని చెప్పడం చాలా ఘోరమని తెలియజేస్తోంది శ్రీముఖి.
తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న అన్నీ విషయాలను విని విని అలసిపోయానని తనకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అవుతోంది శ్రీముఖి. మరి శ్రీముఖి రియాక్షన్ తర్వాత అయినా సరే ఈ పెళ్లి రూమర్లు ఆగుతాయేమో చూడాలి. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర పైన ప్రచారం అయ్యేటువంటి షోలకూ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇలా బాగానే సంపాదిస్తోంది శ్రీముఖి.