సినీ ప్రపంచం బయటకు ఎంత అందంగా కనిపిస్తుందో లోపల ఎన్నో భరించలేని బాధలు ఉంటాయి. టాలెంట్ ఉన్న వాళ్ళను కాకుండా.. పెద్దింటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. ఒకరు చేసిన పనికి మరొకరికి క్రెడిట్ ఇవ్వడం.. పూర్తిగా మనీ మైండెడ్ నేచర్‌తో కలని సమాధి చేయడం వంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే అందరూ వీటన్నింటిని అధిగమించి పైకి రాలేకపోవచ్చు. కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోవచ్చు. జీవితంలో పోరాడలేక ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అలా జీవితాన్ని ముగించుకున్న విలక్షణ నటుడు రంగనాథ్ గురించి మనం ఇప్పుడు కచ్చితంగా తెలుసుకోవాలి.
ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న రంగనాథ్ ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టి పెరిగారు. తన కుటుంబాన్ని పోషించుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసిన ఈయన నాగేశ్వరరావు నటన చూసి ఆశ్చర్య పడిపోయి స్వయంగా నటన మీద ఆసక్తి పెంచుకున్నారు. పుట్టింది మద్రాస్ లోనే కాబట్టి సినిమా అవకాశాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలా ఒక సమయంలో పెద్ద హీరోగా మారే అవకాశాలు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు మరింత ఇబ్బంది పెట్టాయి. దాంతో పరిశ్రమకు కొద్దిరోజులు దూరం పోయి.. కుటుంబాన్ని పోషించడం కోసం వేరొక ఉద్యోగం చేయక తప్పలేదు.
ఇండస్ట్రీ లోకి రాకముందు టికెట్ కలెక్టర్ గా పని చేసిన ఈయన మళ్లీ అదే ఉద్యోగంలో చేరి బండి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. అలా మొత్తం 300 సినిమాలు దాకా చేసిన ఈయన టీవీ సీరియల్స్ కి పరిమితమయ్యాడు. 2009లో ఆయన భార్య చనిపోవడంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన రంగనాథ్ ఒకానొక సమయంలో ఆ బాధ నుంచి బయటపడలేక 2015 లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నప్పటికీ కూడా వారంతా వేరే ఇళ్లలో ఉండడం వల్ల.. ఒంటిరిగా ఉంటూ.. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈయన ఆత్మహత్య చేసుకున్నారు.