సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో అజిత్. ఈ నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అజిత్ అందరి హీరోల లాగా కాకుండా ఈయన రూటే సపరేట్ అని చెప్పవచ్చు. హీరోల అన్న తర్వాత కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇతర రంగాలలో కూడా చాలా టాలెంట్ కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డ వారు చాలామందే ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలోని ఏ హీరోకి లేనటువంటి ఒక క్రెడిట్ కేవలం అజిత్ కు మాత్రమే ఉన్నది వాటి గురించి తెలుసుకుందాం..
అజిత్ కు సినిమాలలోనే కాకుండా బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టము కేవలం బైక్ మీద దేశం మొత్తం చుట్టేస్తూ ఉంటారు.ఇలా బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడే అజిత్ కు తనకు నచ్చినప్పుడల్లా ఏకంగా ఫ్లైట్ రైడింగ్ కూడా చేయడానికి ఇష్టపడతారట. అయితే ఫ్లైట్ నడపడానికి కేవలం లైసెన్స్ కావాలి. లైసెన్సు లేకుండా ఫైట్ నడపడం అంత ఈజీ కాదు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా ఫ్లైట్ నడిపే లైసెన్స్ లేదు కానీ అజిత్ కు మాత్రం ఆ లైసెన్సు ఉందని చెప్పవచ్చు.
పైలట్ లైసెన్స్ పొందడంతో ఈయన ఫ్లైట్ నడుపుకుంటూ గాలిలో విహరిస్తూ ఉంటారు.ఈ విధంగా అజిత్ కి మాత్రమే ఫ్లైట్ లైసెన్స్ ఉందని తెలియడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఇకపోతే అజిత్ సంక్రాంతికి తునివు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగులో తెగింపు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక విజయ్ కూడా వరిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ హీరోల అభిమానుల మధ్య సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుత నెలకొంటోంది.