తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడిచిన ఏడాది మహేష్ బాబు ఇంట తీవ్రమైన విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇక దీంతో పలు సినిమా షూటింగ్ లు అన్నీ కూడా వాయిదా పడడం జరిగింది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న 28వ సినిమా గురించి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే అని తీసుకోవడం జరిగింది.కానీ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ నే మార్చేస్తున్నారేమో అని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి పలు మార్పులు జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ మార్పులు ఏకంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభంలోనే పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఈ సినిమా గురించి ఎలాంటి విషయం అనుకున్న సరే అనుకున్న సమయానికి జరగడం లేదు ఇప్పుడు మొత్తం కథని మార్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో హీరోయిన్ కూడా మార్చేస్తారని ఒకటాకు వినిపిస్తోంది.
రెండో హీరోయిన్ గా పెద్దగా పాత్ర ఏమి ఉండదు కానీ ఈ పాత్ర కోసం కాస్త పేరు ఉన్న గ్లామర్ హీరోయిన్ ని తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే కుర్ర హీరోయిన్ శ్రీలిల పేరు బాగా వినిపించింది. అయితే చిన్నపాటి మార్పులతో ఆమె కూడా ఓకే చేసిందని సమాచారం. అయితే ఈ క్రమంలో మెయిన్ హీరోయిన్ గా ఈమెను కొనసాగిస్తారా అనే విషయం వైరల్ గా మారుతోంది. దీంతో మహేష్ సినిమా కోసం మరొక హీరోయిన్ ని వెతుకుతార అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.