ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. మొన్నటి వరకు హీరోల పుట్టినరోజులకు మాత్రమే రీ రిలీజ్ విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు రోజుతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ముందున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే జల్సా, ఖుషి వంటి సినిమాలను రీ రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లను రాబట్టాయి. దీంతో జల్సా, ఖుషి సినిమాలను మించి వసూలను సాధించేలా బద్రి చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బద్రి సినిమాను ఈనెల 26వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు విదేశాలలో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బద్రి సినిమా కూడా సరికొత్త సంచలన సృష్టించడం కాయమంటు పవన్ అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ క్రీష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ గా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక మరొకవైపు డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు.ఇక ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ పలు రీమిక్స్ సినిమాలను కూడా చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాలన్నీ పూర్తి చేయవలసి ఉన్నది.