తెలుగు బుల్లితెరపై గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ షో ద్వారా ఎన్నో గెటప్పులు వేస్తూ ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటారు. గెటప్ శ్రీను అప్పుడప్పుడు జడ్జిల రోజా, నాగబాబు అంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు తెలియజేశారు.సినిమాలలో పలు పాత్రలో వేస్తున్న శ్రీను. హీరోగా రాజు యాదవ్ అనే సినిమా పేరుతో తనని తాను నిరూపించుకోబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా గెటప్ శ్రీను ఫేస్బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ పెట్టిన సంచలనాన్ని సృష్టిస్తోంది.
మంత్రి రోజా ను డైరెక్టుగా టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గెటప్ శ్రీను. స్వతాగ చిరంజీవికి పెద్ద అభిమాని అయినటువంటి ఈ నటుడు మెగా కుటుంబానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మంత్రి రోజా మెగా బ్రదర్ ను ఉద్దేశిస్తే చేసిన కామెంట్స్ చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు.. చిరంజీవి గారి సేవ గుణ దానగుణం తెరిచిన పుస్తకం ఒక స్ఫూర్తి మరి మీకెందుకు కనపడలేదు? రోజా గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేయవద్దు అంటే ఒక నోట్ నీ విడుదల చేశారు.
ఇలాంటి పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందనుకోలేదు దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. గెటప్ శ్రీను ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగానే ఉంటారు అతనిపై ఇంతవరకు ఒక్క రూమర్ కూడా వినిపించలేదు. ఈ క్రమంలో గెటప్ శ్రీనుకి ఇంతలా కోపం రావడం వల్ల ఈ విషయం చర్చనీ అంశంగా మారుతోంది. కొంతమంది గెటప్ శ్రీను పోస్టుపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.