ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2020 నుంచి కొనసాగుతున్న ఈ సంఘటనలు నేటికీ కూడా కొనసాగుతూ ఉండడం అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఏడాది కూడా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ బాబు నిన్న తుది శ్వాస విడిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈయన వయసు 50 సంవత్సరాలు. గత మూడు రోజుల క్రితం ఎర్నాకులంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కేరళలోని పాతనంతిట్టలో మల్లాపల్లి కి చెందిన సునీల్ తెలుగు ,తమిళ్, హిందీ, మలయాళం చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తాజాగా స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు చిత్రానికి ఆయన చివరిగా పనిచేశారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది. వివిధ భాషల్లో 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన సునీల్ తెలుగులో సీతారామం,మహర్షి తదితర చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాలన్నీ కూడా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా గజిని, లక్ష్యం, స్పెషల్ చౌబీజ్ , ఎంఎస్ ధోని వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. సునీల్ బాబుకు భార్య కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. ప్రస్తుతం ఈయన మరణానికి పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram