మిర్చి సినిమాలో అనుష్కతో పాటు డాన్స్ వేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర పై , వెండితెరపై ఏ ఇండస్ట్రీలో అయినా నటీనటులు కష్టాలు పడందే ఫలితం దక్కదు. అలాగే అగ్ర హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఎవరు కూడా ఒకే ఒక్క రోజులో స్టార్స్ కాలేరు. వాళ్లు చాలా కష్టపడి కృషి చేస్తే తప్ప స్టార్ పొజిషన్లో ఉండలేరని చెప్పవచ్చు. చాలా కష్టపడి క్రేజీను సంపాదించుకున్న స్టార్లు ఎంతోమంది ఉన్నారు. చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో నిలబడ్డా జాబితాలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ చేరింది. ఆమె ఎవరో కాదు యాంకర్ భాను శ్రీ.. ఆమె గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి గురించి చూద్దాం.

Anchor Dance Photos Goes Viral: అనుష్క పక్కన స్టెప్పులేసిన ఈ బిగ్ బాస్  బ్యూటీని గుర్తు పట్టారా? - SumanTV

భాను శ్రీ కెరీర్లో ఎన్నో ఇబ్బందులను కష్టాలను కూడా ఎదుర్కొంది. తనను ఏ విషయంలో అయితే ట్రోల్ చేశారు అదే విషయాన్ని తను స్ట్రెంత్ గా మార్చుకుంది. ఇప్పుడు ఆమె ఒక యాంకర్ గా, నటిగా కొనసాగుతోంది. ఇప్పుడు భాను శ్రీ కి సంబంధించి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. మిర్చి సినిమాలో అనుష్క సరసన డార్లింగే అనే పాటలో చిందులేసింది ఈ అమ్మడు ఆ తరువాత బాహుబలి, కాటమరాయుడు మహానుభావుడు… వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ వంటి హీరో సరసన కూడా నటించింది. కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ సీజన్ 2 లో ఈమె ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టింది.

Bhanu Sri: Age, Photos, Biography, Height, Birthday, Movies, Latest News,  Upcoming Movies - Filmiforest

మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఈమె తరువాత కౌశల్ పై నోరు పారేసుకుని… ఎలిమినేట్ అయిపోయింది. ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోలలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈమెకు సంబంధించి ఎప్పుడు హాట్ ఫోటోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఏదేమైనా భాను శ్రీ అంత కష్టపడినందుకు ఇప్పుడు మంచి ఫలితం అందిందనే చెప్ప వచ్చు..

Share.