కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విజయ్ దళపతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదాలకు నోచుకోదు. విజయ్ భార్య పేరు సంగీత విజయ్ కి తన భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని గడిచిన రెండు రోజుల క్రితం నుంచి వార్తలుగా మారుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియా నుంచి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. విజయ్ సంగీత ప్రేమించుకోని వివాహం చేసుకున్నప్పటికీ విజయ్, సంగీత వీరాభిమాని.. అతనిని ఏరి కోరి మరియు వివాహం చేసుకొని చాలానే కష్టాలు పడిందనే వార్తలు అప్పట్లో చాలా వినిపించాయి.
ఇప్పుడు సంగీత తమ 22 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగింపు పలకనుందా అనే విషయాలు అభిమానులలో సందేహాలను కలిగించేలా చేస్తోంది. ముఖ్యంగా వరిసు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోకి ఏమి రాకపోవడం ఆమధ్య డైరెక్టర్ అట్లీ ఇంట్లో ఫంక్షన్ కి విజయ్ కేవలం ఒంటరిగా వెళ్లడం ఇలా అనేక అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా విజయ్ పాటు ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో విజయ్ కు ,సంగీత కు మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెళ్తే విజయ్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. విజయ్, సంగీత విడిపోలేదని.. సంగీత ప్రస్తుతం అమెరికాలో ఉందని తెలియజేస్తున్నారు. అక్కడే హాలిడేస్ లో బాగా తన కుటుంబం, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోందని తెలియజేసినట్లుగా సమాచారం. అందుచేతనే విజయ్ ఎక్కడికి వెళ్లినా ఒకసారి గానే వెళ్తున్నారని త్వరలో ఆమె అమెరికా నుంచి రాబోతున్నట్లు తెలిపారు .ఇలాంటి ఫేక్ న్యూస్ ని అసలు నమ్మకండి కావాలని ఇలాంటి విషయాలను ఎవరు సృష్టిస్తున్నారని తెలియజేసినట్లు సమాచారం.