తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ,నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు కూడా ఏదోక విషయంపై ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న అవమానాలు గురించి తెలియజేయడం జరిగింది. చరణ్ కు తనకు గొడవలు ఎప్పుడూ జరగలేదని కూడా తెలియజేశారు.యువరాజు లక్షణాలు ఉన్న వ్యక్తి రామ్ చరణ్ అని కూడా తెలియజేశారు బండ్ల గణేష్. ఇక టాలీవుడ్లో స్టార్స్ అందరూ కూడా మంచోల్లే అని వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఏ సమయంలో ఇబ్బంది పెట్టలేదని కూడా తెలిపారు.
అభిమానులను నేను ఎప్పుడూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని కూడా బండ్ల గణేష్ తెలిపారు. కెసిఆర్ చేసిన పనులు చూసి నేను పొగుడుతున్నానని తెలిపారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల కు వరి ఎగుమతి చేస్తున్నామని బండ్ల గణేష్ తెలిపారు. తనకున్న వ్యాపారాలతో పోల్చి చూస్తే ఎలాంటి సమస్య అయినా చిన్నదని తెలియజేశారు. ఇక తన దగ్గర వెయ్యి మంది పనిచేస్తారని కూడా తెలియజేశారు బండ్ల గణేష్. అలాగే పలువు రియల్ ఎస్టేట్లతోపాటు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలియజేశారు.
ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం లో ఉందంటే కచ్చితంగా గౌరవించాలని తెలిపారు. ఇక అమరావతి భూముల గురించి తనకి నిజంగానే తెలియదని నేను ఇప్పటివరకు అమరావతి చూడలేదని బండ్ల గణేష్ తెలిపారు.అయితే తన మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పటికీ అక్కడికి వెళ్లలేదని తెలిపారు. తనని కొంతమంది హైదరాబాదులో ఎందుకు షాద్ నగర్ వెళ్లి కోళ్ల ఫారం చూసుకో అని చాలామంది చెప్పారట.అలా అవమానించిన వాళ్లంతా చనిపోయారని తెలిపారు బండ్ల గణేష్. నేను ఇప్పటివరకు ఏ తప్పు కూడా చేయలేదని తెలిపారు నిర్మాతగా ఎన్నో విజయాలను కూడా అందుకున్నానని తెలిపారు బండ్ల గణేష్.