చిరంజీవి, బాలయ్యకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహారెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక అభిమానులు కూడా ఈ సినిమాల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా గురించి అభిమానులు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు పై కూడా బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ హీరోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుందని సమాచారం.

Chiru – Balayya : Veeraya, Veerasimha Reddy ticket prices going up?

ఈనెల 6వ తేదీన ఒంగోలులో AMB గ్రౌండ్లో జరగవలసిన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు కారణం ఇటీవల జరిగిన కొన్ని దుర్ఘటమైన సంఘటనల కారణంగా ఇలాంటి భారీ కార్యక్రమాలలో తొక్కిసలాటలు జరుగుతాయని ఉద్దేశంతోనే అమాయకుల మరణాలు కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకొని ఈ సభలకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య సినిమా నే కాకుండా చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈనెల 8వ తేదీన వైజాగ్ లో భారీ ప్లాన్ వేసినట్లుగా వార్తలు వినిపించాయి.

వీటిని కూడా ఏపీ ప్రభుత్వం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం ఇప్పుడు ఈ వేడుకలను హైదరాబాదులో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈవెంట్లను సక్సెస్ చేసేందుకు చిత్ర బృందం ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకతో పాటు చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకకు కూడా అభిమానులు భారీగానే తరలివచ్చే అవకాశం ఉన్నందువలన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందస్తు జాగ్రత్త తెలియజేసినట్లు సమాచారం. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమా విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Share.