రోజాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో కమెడియన్ గా,నిర్మాతగా బండ్ల గణేష్ ఎన్నో సినిమాలలో నటించి మరికొన్ని సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన హీరోయిన్, జడ్జ్, పొలిటికల్ లీడర్ రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఆంధ్ర రాజకీయాల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురైతే ఆంధ్ర గురించి ఎవరికి తెలుసు అంటూ కామెంట్ చేశారు. రాజకీయం అంటేనే పెద్ద రోత అలాంటివి మనకెందుకు అని కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి కామెంట్స్ పై మాత్రమే స్పందించానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఆయన ఎవరో కాదు విజయ్ సాయి రెడ్డి.

Bandla Ganesh on the receiving end for sharing a pic with Roja -  TeluguBulletin.com

విజయ్ సాయి రెడ్డి పై రియాక్ట్ కావడంతో రాజకీయాలు నీకెందుకు అని బొత్స సత్యనారాయణ కాల్ చేసి తిట్టార. ఇక బొత్స సత్యనారాయణ అంటే బండ్ల గణేష్ కి చాలా అభిమానమని ఆయన తెలిపారు. ఇక వైవి సుబ్బారెడ్డి గారు ఆయన వారి భార్యను చూస్తే శివుడు పార్వతి లా కనిపిస్తారని బండ్ల గణేష్ వారిపై కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణకు చెందిన కేటీఆర్ బండ్ల గణేష్ మాతో చాలా బాగా మాట్లాడేవారుని. ప్రస్తుతం హోదా మారడంతో బిజీగా ఉండడంత ఎక్కువగా కలవలేక పోతున్నామని తెలిపారు.

ఇక వైయస్సార్, చంద్రబాబు వీరిద్దరూ హైదరాబాదును ఒక కొలిక్కి తెస్తే కెసిఆర్ ఇంకో స్థాయికి తీసుకువెళ్లారని బండ్ల గణేష్ ఆయన మాటల్లో తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి నన్ను అడగవద్దని బండ్ల గణేష్ ఈ సందర్భంలో పేర్కొన్నాడు. మనిషిని అయితే తిట్టవచ్చని కులాన్ని అయితే తిట్టకూడదని నేను కోరుకుంటున్నాను అని అన్నారు బండ్ల గణేష్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన రోజా గారు నా సోదరి లాంటి వారు. రోజా గారు నాపై ఎలాంటి కేసు పెట్టలేదని ఆమె ఊరికే అన్నారని బండ్ల గణేష్ తెలిపారు. ఇక రోజా గారు సినిమాలో ఎంత పెద్ద సక్సెస్ ని సాధించింది.. అలాగే రాజకీయాల్లో కూడా అంతే సక్సెస్ ని అందుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నానని కామెంట్స్ చేశారు బండ్ల గణేష్ ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share.