Project -k సినిమా మొదటి డీల్ ఎన్ని కోట్ల తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించడమే కాకుండా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ చేతులో ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-k, ఆది పురుష్, రాజా డీలక్స్, స్పిరిట్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. గతంలో విడుదలైన సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల పైన అభిమానులు చాలా ఆశపెట్టుకున్నారు.

Prabhas and Deepika Padukone Project K pre production video from scratch  shared by makers | मेकर्स ने दिखाई Project K की खास झलक, प्रभास और दीपिका  पादुकोण आएंगे नए अवतार में नजर! |

ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ -k సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయగలదని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్డేట్ కూడా చిత్ర బృందం తెలియజేసింది. అయితే తాజాగా బిజినెస్ వ్యవహారాలను కూడా అప్పుడే మొదలుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే మరొకవైపు నిర్మాత నాగ్ అశ్వన్ ఈ సినిమా వ్యాపారాన్ని కూడా మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోని చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వైరల్ గా మారుతోంది.

Prabhas' Project K distribution rights for Nizam territory sold for a  whopping Rs 70 crore! - India Today

అదేమిటంటే నైజాం చెందిన బడా సిండికేట్ గ్రూప్ ఈ సినిమా థియేటర్ హక్కులను దాదాపుగా రూ.70 కోట్లకు పైగా కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఏసియన్ సునీల్ నిర్మాత సురేష్ బాబు కూడా చాలాకాలంగా డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూ ఉన్నారు. గతంలో వీరి కలయికలు వచ్చిన సీతారామం, కార్తికేయ -2 సినిమాలు విడుదల అవ్వగా ఇటీవల ధమాకా సినిమాలను కూడా చాలా గ్రాండ్గా విడుదల చేశాయి .ఈ సినిమా లు అన్నీ కూడా భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ -k సినిమా నైజాం హక్కులను కూడా భారీ ధరకే కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇదే మొదటి డీలర్ అని సమాచారం. ఈ చిత్రం రూ .500 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు.

Share.