గీత గోవిందం వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగులో ది మోస్ట్ వాంటెడ్ మూవీగా ‘గీత గోవిందం’ అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ హీరో నటిస్తు్న్న ఈ సినిమాపై యూత్‌లో పిచ్చ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో మనోడు మళ్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది.

మెగా ప్రొడ్యూసర్ అల్లరు అరవింద్ GA2 బ్యానర్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్‌లో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.15 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ టార్గెట్ విజయ్ దేవరకొండ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకు చాలా తక్కువే అని చెప్పాలి. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అదిరిపోయే ఘాటైన లిప్‌లాక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని టీజర్లు కూడా ఇప్పటికే లీక్ అవ్వడంతో ఈ సినిమాను మొదటి రోజే చూసేయాలని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఆగష్టు 15న వస్తున్న గీత గోవిందం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా – ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు(కోట్లలో)
నైజాం – 4.0
సీడెడ్ – 2.0
వైజాగ్ – 1.1
ఈస్ట్ – 0.7
వెస్ట్ – 0.6
కృష్ణా – 0.8
గుంటూరు – 0.9
నెల్లూరు – 0.4
టోటల్ ఏపీ+తెలంగాణ – 10.5 కోట్లు
కర్ణాటక – 1.3
రెస్టాఫ్ ఇండియా – 0.5
ఓవర్సీస్ – 2.7
టోటల్ వరల్డ్‌వైడ్ – 15 కోట్లు

Share.