కోలీవుడ్ హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట వర్షం సినిమాతో తన కెరీయర్ని మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్లో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పైనే అవుతున్న ఇప్పటికీ అదే అందంతో ఫిజిక్ తో వరుస అవకాశాలను అందుకుంటోంది. గడచిన కొద్ది రోజుల క్రితం ఆచార్య సినిమాలో నటించే అవకాశం వచ్చిన ఎందుకో ఆ సినిమా నుంచి తప్పుకుంది.
ఇక ఈ సినిమా వదులుకున్న తర్వాత కోలీవుడ్లో పలు చిత్రాలను ఓకే చేసి అక్కడ ఫుల్ ఫామ్ లో ఉన్నది. ముఖ్యంగా పోన్నియన్ సెల్వన్ సినిమా త్రిష కు బాగా డిమాండ్ పెంచిందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు విజయ్ అండ్ అజితులతో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే తెలుగులో బాలకృష్ణ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఏమైనా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తమిళంలో త్రిష నటించిన రాంగి సినిమా గడచిన రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో త్రిష లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించింది. ఈమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రాంగి సినిమా ప్రమోషన్లలో త్రిష తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుంద వై పాత్ర తనకి ఇచ్చిన మణిరత్నం గారికి థ్యాంక్స్ తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా చేసిన మణిరత్నం గారికి మరి స్పెషల్ థాంక్స్ అంటూ స్టార్ హీరోలు అందరితో కనిపించాను… కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఫుల్ లెన్త్ సినిమా చేయాలని కోరిక ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తోంది. ఎట్టకేలకు తన కోరికను బయట పెట్టడంతో అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు. మరి కాంబినేషన్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.