టాలీవుడ్లో రష్మిక ,విజయ్ దేవరకొండ వ్యవహారం బయటపడిందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రష్మిక ,విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తోంది అంటూ పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ రష్మిక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం మేమిద్దరం స్నేహితులు మాత్రమే అంటూ తెలియజేశారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా వీరు చేసిన ఒక పని మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఫిలిం స్టార్స్ అంత అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ సందర్భంగా విష్ చేయడం జరిగింది.. న్యూ ఇయర్ ..న్యూ మంత్.. న్యూ డే ఆడియస్స్ .. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటు పోస్ట్ చేశారు.

Vijay Devarakonda Rashmika | Vijay Devarakonda Rashmika : మాల్దీవుల నుంచి  న్యూ ఇయర్ విషెస్..మళ్లీ మొదలైన రచ్చ | ABP Desam

విజయ్ చేసిన కొన్ని నిమిషాలకే రష్మిక కూడా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ పోస్ట్ చేసిన 15 నిమిషాల తర్వాత రష్మిక కూడా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపడంతో పాటు.. హలో 2023 అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇక్కడే ఒక కొత్త అనుమానం దారితీసింది. విజయ్,రష్మిక ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ప్లేస్ గురించి ఇద్దరు క్లారిటీ ఇవ్వక పోవడానికి గల కారణం ఏంటి అంటూ అభిమానులకు పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోసారి బయట పడ్డ బండారం, న్యూ ఇయర్ కోసం మాల్దీవులకు విజయ్ దేవరకొండ,  రష్మిక...?

విజయ్ దేవరకొండ ఫోటో చూస్తే సముద్రం తీరంలో రిసార్టు దగ్గర స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రష్మిక కూడా ఏదో రిసార్ట్ దగ్గర ఫూల్ పక్కన కనిపిస్తోంది.దీంతో ఇద్దరు ఒకే చోట ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ మాల్దీవులు ఎంజాయ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోచోట చేసుకుంటున్నారని విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.