తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష కూడా ఒకరు. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక ప్రభాస్ తో మొదట వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస విజయాలను అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అందరితోను నటించింది ఈ ముద్దుగుమ్మ. కొంతకాలం తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తర్వాత తమిళంలో అవకాశాలు రావడంతో అక్కడ కూడా తన హావ కొనసాగించింది. ఇక అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ఇదంతా ఇలా ఉండగా హీరోయిన్ త్రిష సినీ ఇండస్ట్రీలో ఒక వ్యక్తితో మాత్రమే తండ్రిగా ,బాయ్ ఫ్రెండ్ గా, మామ గా నటించింది. అయితే ఆ నటుడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ నటుడు ఎవరో కాదు విలక్షణమైన నటుడుగా పేరుపొందిన యాక్టర్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజుతో కలిసి త్రిష వర్షం,ps -1, ఆకాశమంత సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమెకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిషకు మామగా నటించారు.
ఇక మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమానీ తమిళంలో విజయ దళపతి నటించారు. ఈ చిత్రంలో త్రిష నటించింది. ఇందులో త్రిష బాయ్ ఫ్రెండ్ గా (విలన్) నటించారు. నేనే ఇండస్ట్రీలోకి త్రిష ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి కొన్నేళ్లు అవుతున్నప్పటికీ అదే అందంతో ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.