టాలీవుడ్లో నటసింహ బాలకృష్ణ తన కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే అహ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గానే ఉంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆహా లో గెస్ట్ గా ఈసారి పవన్ కళ్యాణ్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే .తాజాగా ఈ షో కు సంబంధించి షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా ఈ షోని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ షో కి సంబంధించి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ షోలో కొంతమంది పవన్ మరియు బాలకృష్ణ ఎపిసోడ్ లకు సంబంధించి సోషల్ మీడియాలో ఏం జరిగిందో అనే విషయంపై ఎక్కువగా సెర్చ్ చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ షో కి సంబంధించి స్టేలింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. ప్రతి ఎపిసోడ్కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది తేజస్విని.
పవన్ కళ్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉండడమే కాకుండా సినీ ప్రముఖులు కూడా అభిమానులుగా ఉండడం సర్వసాధారణం. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ కు తేజస్విని కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని కారణం చేతనే ఈ షోకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వేరకు ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.