తన తదుపరి చిత్రాలపై క్లారిటీ ఇచ్చిన శ్రీ లీల..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి సినిమా తోనే క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల ఈమె పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె తన నటనతో అందంతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈమె రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో ఈమె దర్శక నిర్మాతల కంటపడింది. దాంతో ఆమె కి సినిమా అవకాశాల వర్షం కురుస్తోందనే చెప్ప వచ్చు.ఇక ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ లో నటించే హీరోయిన్ ఎవరు.. ఆమేనా ఈమేనా | Actress  Sree Leela To Act In DJ Tillu Sequel details, DJ Tillu, DJ Tillu 2, Siddu  Jonnalagadda, neha shetty, SreeLeela, Anupama

ఇలా ధమాకా సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకి మరిన్ని అవకాశాలు వెల్లుపడుతున్నాయి.. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీ లీల ఒక క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు విడుదలై ఎలాంటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే . ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీలా, అనుపమ ఎంపిక చేశారని.. అయితే కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి.తాజాగా ఈ సినిమా గురించి శ్రీ లీల తప్పుకోవటానికి గల కారణాల గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. శ్రీ లీల

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీ లీల డీజే టిల్లు సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించమని నన్ను ఎవరు అడగలేదు. అయితే ఈ సినిమాకు నేను కమిట్ అయ్యి కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొన్నానే ఇలా వచ్చే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అంటూ ఇవన్నీ ఒట్టి పుకార్లే అంటూ శ్రిలీల చెప్పుకొస్తోంది.ఒకవేళ ఆమె ఏ సినిమాకైనా కమిట్ అయితే సోషల్ మీడియాలో అందరితో పంచుకుంటానని తెలియజేసింది. దీంతో ఈ వార్తలపై వస్తున్న వాటర్ అన్నిటికి చెక్ పెట్టింది.

Share.