తెలుగు ప్రేక్షకులకు నటి దేవయాని గురించి చెబితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మొహం చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు.. ఇక ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమాలో దేవయాని హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈమె నటనకు అద్భుతమైన మార్కులు పడడంతో పాటు ఎంతోమంది కుర్రకారుల మనసు దోచింది. ఈ సినిమా తర్వాత ఈమెకు హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈమె తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కేవలం తెలుగు, తమిళ భాషలలో కాకుండా మలయాళం, బెంగాలీ వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ అక్కడ కూడా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక దేవయాని అన్ని ఇండస్ట్రీలో కలిపి దాదాపుగా ఇప్పటివరకు 90కు పైగా సినిమాలలో నటించింది. బుల్లితెర మీద ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో డైరెక్టర్ రాజకుమార్ను ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి సీక్రెట్ గా వివాహం చేసుకుంది.
ఇక వివాహం చేసుకున్న వెంటనే ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో కుటుంబ జీవితంలో బిజీగా మారిపోయింది. దీంతో అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించింది. ఆ సినిమాలు భారీ ఫ్లాప్ కావడంతో ఆర్థికంగా నష్టపోయి కుటుంబ జీవన మరువడ కోసం ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా కొద్దిరోజులు పనిచేస్తుందట. ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో రావడంతో మళ్లీ సెకండ్ ఇన్స్ను మొదలుపెట్టింది దేవయాని. అలా ప్రస్తుతం తమిళ్ మలయాళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ తో పాటు తెలుగులో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.