ఎలాంటి వారికైనా సరే బలహీనతలు ఉండడం సర్వసాధారణం. వాటివల్లే కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివి స్టార్ హీరోలకు కూడా ఉండనే ఉంటాయి. అలా బలహీనతలు ఉన్నవారిలో ప్రభాస్ కూడా ఒకరు. సినిమాల విషయంలో ప్రభాస్ కింగ్ అయినప్పటికీ పర్సనల్ విషయాలలో కూడా మంచి వ్యక్తిత్వం కలవాలని చెప్పవచ్చు. ప్రభాస్ ఎవరు వచ్చినా కూడా తన ఇంటికి అన్నం పెట్టందే పంపించడు ఆనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దేశం మొత్తం బాగా పాపులర్ అయ్యారు.
ప్రభాస్ గురించి మరొక కమెడియన్, నటుడు ప్రభాస్ శ్రీను కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ప్రభాస్ ఇమేజ్ పెరిగింది కాబట్టే మనం కూడా మారాలి అని ఆలోచన లో ప్రభాస్ ఉండరు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు అంటూ తెలియజేశారు. అంతేకాకుండా ప్రభాస్ కు బలహీనత చాలా ఉందని ..అతని మంచితనమే అది అని తెలియజేశారు ప్రభాస్ శ్రీను. మంచితనమే ప్లస్ ..అప్పుడప్పుడు అదే అతనికి మైనస్ అవుతుందని కూడా తెలియజేస్తున్నారు. ప్రభాస్ ఎవరిపైన కోపం వస్తే అసలు మాట్లాడడని అతని నవ్వు చాలా బాగుంటుందని సైలెన్స్ అంతకుమించి భయంకరంగా ఉంటుందని తెలిపారు ప్రభాస్ శ్రీను.
అందుచేతనే ప్రభాస్ తో తెలిసిన వాళ్ళు చాలామంది ఎక్కువగా గొడవపడరని తెలియజేశారు. సీతయ్య సినిమాతో యాక్టర్ గా తన కెరీయర్ ను మొదలు పెట్టాను.. ప్రభాస్ అసిస్టెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసిన నేను ప్రభాస్ శ్రీను అనే పేరును ఫిక్స్ అయ్యానని తెలియజేశారు. తను రెబల్ స్టార్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని ప్రభాస్ వల్లే తను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానని తెలియజేశారు. ప్రభాస్ దగ్గరున్నాడు కాబట్టే ప్రభాస్ గురించి చాలా విషయాలు తనకి తెలుసు అని తెలిపారు. అలాగే కృష్ణంరాజు గారు కూడా ప్రభాస్‌ను రాజుగారు అంటు.. ప్రభాస్ శ్రీను ని మంత్రి గారు అని అంటుండే వారట. ప్రభాస్ అప్పటికి ఇప్పటికీ ఒకే లాగా ఉన్నారని తెలిపారు శ్రీను.