పెళ్లయిన ఆరు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి శ్రీ మహాలక్ష్మి సినిమాతో అడుగుపెట్టి ఆ తరువాత చిన్న హీరోల సినిమాలలో నటించి పెద్ద హీరో సినిమాల వరకు నటించింది పూర్ణ ఇక అవును, అవును 2 థ్రిల్లర్ సినిమాతో అందరిని మెప్పించి ఆకట్టుకుంది పూర్ణ .ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ,మలయాళం భాషలలో నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది. ఇక అప్పుడప్పుడు సినిమాలను చేస్తూ మరోవైపు బుల్లితెరపై ఢీ షోలో జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తోంది.

Shamna kasim: పూర్ణ శుభవార్త! | Actress Poorna announces her pregnancy avm

ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ ఏడాది జూన్ లో 12న దుబాయ్ వేదికగా వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీతో పూర్ణ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా తన పెళ్లి విషయాన్ని నాలుగు నెలల పాటు రహస్యంగా ఉంచింది పూర్ణ అక్టోబర్ లో సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ఫాన్స్ తో పంచుకుంది. ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో తన కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటూ సెలబ్రేషన్ చేసుకొనే ఫోటోని తన ఇన్ స్టా స్టోరీలోనూ షేర్ చేసింది.

ఆ పోస్టులో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించటంతో తన ఫాన్స్ అభిమానులు వారి దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ అందాల తార ఈ ఏడాది ఆది సాయికుమార్ నటించిన తీన్మార్ ఖాన్ లో కీలకపాత్రలో నటించింది. ఇక పలు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. పూర్ణ ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకి శ్రీకాంత్ కొణిదెల దర్శకత్వం వహించారు. అలాగే మలయాళం లో ఒక సినిమాలో నటించబోతోంది పూర్ణ. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Share.