టాలీవుడ్ హీరో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఆ తర్వాత రాంచరణ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని చవిచూసింది. కావలసిన అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా బాలీవుడ్లో మరొక నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అంతే కాకుండా వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు.. ఇక సిద్ధార్థ ఇంటికి కియారా వెళ్లడం అలాగే పార్టీస్ కి అటెండ్ అవ్వడం వంటివి చేయడంతో వీరిద్దరు డేటింగ్ వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ షో లో సిద్దు తన ప్రేమ పెళ్లి గురించి హింట్ ఇవ్వడం జరిగిందట. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వీరి ప్రేమాయణం తెరపైకి రావడం జరుగుతుంది. త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని వచ్చే యేడాది ఫిబ్రవరిలో జైసల్మేర్ లో వివాహం జరగబోతోందని టాక్ వినిపిస్తోంది.
ఇక తర్వాత ఢిల్లీలో వీరిద్దరి రిసెప్షన్ కూడా జరగబోతున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. మరి వీరి వివాహానికి కరణ్ జోహార్, వరుణ్ ధావన్, రకుల్, కత్రినా కైఫ్ వంటి వారీ ప్రముఖులకే ఆహ్వానం అందినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.