తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటుడు కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతిహాసన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన పెద్దగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది శ్రుతి. అయితే పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల అందరు సరసన నటించింది.
అలాగే తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్లీ రీ యంట్రి ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ దశ మళ్ళీ తిరిగి పోయింది. ప్రస్తుతం చిరంజీవి, బాలయ్య సరసన కూడా నటిస్తోంది. వీరితో పాటే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
సినిమాలలో నటించాలంటే వయసుతో అసలు సంబంధం లేదని.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని తెలియజేస్తోంది. వయసు గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కేవలం తాము నటించ పాత్రలపైన దృష్టి పెడితే సరిపోతుందని తెలియజేస్తోంది. నటీనటులు తాము చేసే పాత్రలు అందరికీ నచ్చాలని రూలేమీ లేదు. కొన్ని పాత్రలు నచ్చకపోవచ్చు.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది నేను నటించిన పాత్రలను ఇష్టపడలేదు..మొదట్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు సినిమాల పట్ల తనకున్న తపన అందరికీ అర్థమైందంటూ తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.