టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి నటిగా పేరు పొందింది హీరోయిన్ అంజలి. ఇక తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమధ్య పలు లేడి ఓరియంటెడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. తాజాగా అంజలి పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం హీరోయిన్ అంజలి, రామ్ చరణ్ నటించిన Rc -15 చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ కొన్నిసార్లు రొమాంటిక్ సన్నివేశాలు నటించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.. కానీ సినిమా కోసం తప్పదు అలాంటి సమయంలో చాలా ఇబ్బంది పడేదాన్ని కొన్ని సినిమాలలో పాత్రకు తగ్గట్టుగా మొద్దు సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది.. మనకు ఇష్టం లేని వ్యక్తి ముద్దు పెట్టుకోవడం అదొక ఇబ్బంది అని తెలియజేసింది.
అలాగే కొన్నిసార్లు ఇంటిమెంట్ సీన్లలో నటించినప్పుడు తట్టుకోలేక క్యారవాన్ లో వెళ్లి ఏడ్చే దానిని అంటూ తెలియజేస్తోంది. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని తెలియజేస్తోంది. అయినా కూడా కేవలం సినిమాలలోని సీన్ల కోసం అలా నటించాల్సి వస్తోంది అంటు ఎమోషనల్ గా తెలియజేస్తోంది అంజలి. ప్రస్తుతం అంజలి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా అంజలి పైన పలు రూమర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు వాటి మీద స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.