క్రికెట్ రిషబ్ పంత్ ఈరోజు ఉదయం యాక్సిడెంట్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు కానీ కొద్దిసేపటి క్రితమే కొంత ఆరోగ్యానికి సంబంధించి బీసీసీ లేఖ విడుదల చేసింది. భయపడాల్సిన పనిలేదు రిషబ్ పంత్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ ఒక లేఖని విడుదల చేసింది. దీంతో రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానుల సైతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
దీంతో దేశవ్యాప్తంగా పంత్ అభిమానులు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఆ పోస్టు పంత్ కోసమే పెట్టినట్లుగా సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ పంత్ ఊర్వశి ఇద్దరు కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవ్వడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ కూడా బాలీవుడ్లో పలు కథలు వినిపించాయి.
ఆ తర్వాత కొద్ది రోజులకి స్నేహితురాలు ఇషా నేగి తో రిలేషన్ లో ఉన్నానంటూ రిషబ్ ప్రకటించారు. అంతేకాకుండా అందుకు సంబంధించి ఒక ప్రేమ లేఖను కూడా రాయడం జరిగింది. దీంతో ఊర్వశి తో డేటింగ్ అనేది కేవలం ఒక రూమర్లు గాని మిగిలిపోయాయి. తాజాగా తమ కుటుంబ సభ్యులను సర్ప్రైజ్ చేయాలని రూర్కి కి బయల్దేరారు పంత్ కానీ రోడ్డు మధ్య మార్గంలో యాక్సిడెంట్ అవ్వడంతో ఒక్కసారిగా అంత మారిపోయింది. ప్రస్తుతం ఊర్వశి షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతొంది.
View this post on Instagram