టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు. తాజాగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రిమింగ్ అయింది. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసారిగా అందరూ ఆహా యాప్ ను ఉపయోగించడంతో..ఆహా యాప్ క్రాష్ అయినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా ఈ ఎపిసోడ్ స్ట్రిమింగ్ అయింది.
ఇందులో ప్రభాస్, బాలయ్య మధ్య ఎన్నో సరదా సంభాషణలతో పాటు ప్రభాస్ వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు. బాలయ్య అలాగే గోపీచంద్ కూడా ఇందులో తామిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా తెలియజేశారు. అయితే గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న కృతి సనన్ తో డేటింగ్ పైన ప్రభాస్ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రేమ అంటూ వచ్చిన వార్తలపై బాలయ్య ప్రశ్న అడగగా.. అందుకు ప్రభాస్ స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని కేవలం స్నేహం మాత్రమే ఉందని ఇదే విషయాన్ని ఇప్పటికే కృతి కూడా క్లారిటీ ఇచ్చిందని తెలియజేశారు.
దీంతో వీరిద్దరి మధ్య వస్తున్న వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు. ఇక తన పెళ్లి గురించి మరొకసారి రియాక్ట్ అవుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇక తన పెళ్లి ఇంకా రాసి పెట్టలేదేమో సార్ అంటే సరదాగా తెలియజేశారు. ప్రభాస్ చైల్డ్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు చూపిస్తూ చాలా ఆట పట్టించినట్లుగా తెలుస్తోంది. అలాగే శృతిహాసన్ హీరోయిన్ ఆసిన్ సైతం బాలయ్యను తెగ పొగిడేసారని చాలా క్యూట్ అంటే చెప్పుకొచ్చారు ప్రభాస్.