టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం యాంకర్ గా నటిగా మంచి పాపులారిటీ సంపాదించింది యాంకర్ అనసూయ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా ఎదిగిన ఇమే ఆ క్రేజ్ తోనే పలు చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటించింది అనసూయ. అయితే ఈమధ్య జబర్దస్త్ లో బాడీ షేవింగ్లు వల్ల ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పిందని విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.సోషల్ మీడియాలో కూడా అనసూయ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అనసూయ. తన మాటలతో డ్యాన్సులతో అందర్నీ ఫిదా చేస్తూ ఉంటుంది. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. గత ఏడాది విడుదలైన పుష్ప చిత్రంలో నెగటివ్ రోల్ లో అద్భుతమైన నటన ప్రదర్శించింది. మొత్తానికి అనసూయ బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా తన సత్తా నిరూపించుకుంటోందని చెప్పవచ్చు. ఇక అనసూయ వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అనసూయ అందంలో ఎలాంటి మార్పు లేదని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
ఇప్పటికీ అదే గ్లామర్ తో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది..నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తమ అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది. ఇటీవలే తనని ట్రోల్ చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేయించింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని షేర్ చేసింది. అందులో ఒక విషయాన్ని తెలియజేసింది అదేమిటంటే ఒక కప్పు కాఫీ చేయడానికి కూడా ప్రేమ భాష కిందికే వస్తుంది అంటూ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ గా మారుతోంది .అయితే అనసూయ ఇప్పుడు ప్రేమ గురించి ఎందుకు పోస్ట్ షేర్ చేసిందో అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు.